భగత్ సింగ్ 7 సం. వయసులోనే తండ్రితో పొలానికి వెళ్ళినప్పుడు "నాన్నగారు! గోదుమ గింజలు నాటితే
ఇంతపంట పండిండి కదా! తుపాకులు, తూటలు, పాతితే మరెంతగా ఫలితంవస్తుందో? వాటితో బ్రిటిష్ వారిని
మనదేశం నుంచి తరమొచ్చు' అన్నాడు. ఆ ఊహ అసంబద్ధమైనా అతని మనసులో రూపుదిద్దుకుంటున్న
మహౌన్నత ఆశయం ఎంతో ఉదాత్తమైనది. వయసుకు మించి ఆలోచించే అతణ్ణి మరో ఘటన పూర్తిగా
మార్చివేసింది. స్నేహితులు, పెద్దల ద్వారా అతను 'జలియన్ వాలాబాగ్' చేరుకున్నాడు. అప్పటికే ఆ
ప్రాంతంలో కాపలా ఉన్న పోలీసులను ఏమార్చి లోపలికి వెళ్లాడు. తన వెంట తీసుకువెళ్ళిన ఓ గాజుసీసాలో
భారతీయుల నెత్తుటితో తడిసిన అక్కడి మట్టిని నింపుకుని, మృతులకు నివాళులు అర్పించి ఇంటికి
వచ్చాడు. ఆ సీసాను ఇంటి మధ్యలో బల్లపై ఉంచి, మృతులకు ప్రతిరోజూ శ్రద్ధాంజలి ఘటిస్తూ తన భవిష్యత్
ఆచరణను మనసులోనే రూపొందించుకునేవాడు. అప్పటికి అతని వయస్సు పదకొండు సంవత్సరాలే!
సత్యసంధుడు, అహింసావ్రతుడు,మానవత్వం మూర్తీభవించిన మహానీషి, మహామేధావి, ముందుచూపుతో
గాంధీ కంటె తెలివిగా ప్రజల కోసం సర్వమానవ సౌభ్రాతృత్వం కోరిన విప్లవ వీరుడు భగత్ సింగ్.
No comments:
Post a Comment