Search This Blog

Friday, October 21, 2011

ఫోనుంటేనే కనెక్షన్!


బెజవాడ, న్యూస్లైన్(sakshi) : భారత్ సంచార్ నిగమ్ లిమిటెడ్ (బీఎస్ఎన్ఎల్) అభివృద్ధికి సామగ్రి కొరత ప్రతిబంధకంగా మారింది. టెలిఫోన్ మొదలుకుని ఇంటర్నెట్ కనెక్షన్లో అత్యంత కీలకమైన మోడెం పరికరాలు, వైర్ల లేమితో సంస్థ సతమతమవుతోంది. కొత్తగా ల్యాండ్లైన్, బ్రాడ్బ్యాండ్ కనెక్షన్ కోసం ఎవరైనా దరఖాస్తు చేసుకుంటేఫోన్, మోడెంలను మీరే కొనుక్కోండి, కనెక్షన్ ఇస్తాంఅంటూ అధికారులు చెబుతున్నారు. దీంతో అత్యవసరం అనుకునే వినియోగదారులు మాత్రమే కనెక్షన్ తీసుకుంటున్నారు. పాత ఫోన్ల స్థానంలో కొత్త కనెక్షన్ ఇవ్వాలన్నా సామగ్రి కొరత వెంటాడుతోంది. దాదాపు జిల్లాలోని అన్ని టెలిఫోన్ ఎక్స్ఛేంజిలలో ఇదే తీరు కొనసాగుతోంది. హైదరాబాద్ సర్కిల్ కార్యాలయంలోనే సామగ్రి లేనందున ఇండెంట్లు పంపినా ఫలితం ఉండడం లేదని అధికారులు చెబుతున్నారు.
300 నిమిషాలు ఉచితం
కొత్తగా ల్యాండ్లైన్ కనెక్షన్ తీసుకున్న వారు సొంతంగా టెలిఫోన్ కొనుగోలు చేస్తే నెలకు 100 నిమిషాలు చొప్పున మూడు నెలలపాటు 300 నిమిషాల ఉచిత కాల్స్కు అనుమతిస్తామని అధికారులు చెబుతున్నారు. బ్రాడ్బ్యాండ్ పరంగా ఇంటర్నెట్ కనెక్షన్ ఇవ్వడానికి ఆయా సామర్థ్యాలను బట్టి మోడెంలను సంస్థ సమకూర్చాల్సి ఉంటుంది. వీటి చార్జీలను వినియోగదారులు ముందుగా చెల్లించాలి. అయితే టైప్-1, టైప్-2గా వ్యవహరించే మోడెంలు కూడా సంస్థ వద్ద లేవు. దీంతో ఆయా పథకాల పరంగా కనెక్షన్ చార్జీలు మాత్రమే వసూలుచేసి మార్కెట్లో మోడెంలను కొనుగోలు చేసుకోవాల్సిందిగా అధికారులు సూచిస్తున్నారు.
సామగ్రి కొరత పుణ్యమా అని సంస్థ అభివృద్ధి కుంటుపడే ప్రమాదం ఉందంటూ ఉద్యోగ సంఘాలు ఆందోళన వ్యక్తం చేస్తున్నాయి.

No comments:

Post a Comment